

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం లోని ఎమ్మార్పీఎస్ నాయకులు బాబు జగజీవన్ రావ్ చిత్రపటానికి విగ్రహాలకి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 18 వ వార్డు కౌన్సిలర్ ఎండగుండి నాగబాబు మాట్లాడుతూ భారతదేశానికి ఒక దిక్సూచి లాగా ఆయన యొక్క ఆలోచనలు ఉండేవని దళిత జాతికే కాకుండా భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడరు. అదేవిధంగా ఒక గొప్ప రాజకీయ నాయకుడు, పోరాట యోధుడు, సంఘసంస్కర్త అయినా బాబు జగజీవన్ రాయ్ బీహార్ లోని వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి భారత పార్లమెంట్ లో 40 సంవత్సరాల పాటు వివిధ పదవులతో పాటు భారతదేశ ఉప ప్రధానిగా కూడా సేవలందించాడని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కాకడ నాగేశ్వరరావు,గంటెటి కిషోర్,వంగలపూడి నాగబాబు,వేమగిరి బ్రహ్మానందం, కట్టుమూరు రాజు, రాయి మోసే,గోడతా రాజు, ఎమ్మార్పీఎస్ సోదరులు పాల్గొన్నారు*