మణుగూరు ఏరియా సింగరేణి వైద్యశాల ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె. మౌనిక

మన న్యూస్ : హర్షం వ్యక్తం చేసిన సింగరేణి ఉద్యోగులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి ఎం ఓ) కి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవకులు కర్నె బాబురావు పినపాక నియోజకవర్గం, ఏరియా సింగరేణి కార్మికుల తరపున తమ అభ్యర్థనను మన్నించి మణుగూరు ఏరియా సింగరేణి ఆసుపత్రిలో ప్రతి గురువారం సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండే విధంగా డిప్యూటేషన్ పై ప్రసూతి వైద్య నిపుణురాలిని బాలల దినోత్సవం రోజున నియమించడం పట్ల ప్రముఖ సామాజిక సేవకులు కర్నె బాబురావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి. సుజాత కి పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ అభ్యర్థన మన్నించి ఇచ్చిన మాట ప్రకారం మరుసటి రోజే మణుగూరు ఏరియా హాస్పిటల్ లో డిప్యూటేషన్ పై జె. మౌనిక ని నేను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం సింగరేణి ఏరియా హాస్పిటల్ లో ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన జే. మౌనిక ని అక్కడికి వైద్యానికి వచ్చిన మరికొందరితో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గర్భిణీల మనసు గెలుచుకునేలా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. ఏరియా హాస్పిటల్ ఉప ముఖ్య వైద్యాధికారిని మేరీ కుమారి కి వైద్యులు డాక్టర్ శేషగిరిరావు కి సురేష్ కి, వెంకట రమణయ్య కి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గర్భిణీ మహిళలు కూడా పాల్గొన్నారు.

  • Related Posts

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లీ మండలంలోని సిర్పూర్–మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను బాన్సువాడ సబ్‌ కలెక్టర్ కిరణ్మయి స్వయంగా సందర్శించి తనిఖీ చేశారు.ఎన్నికల నియమావళిలో భాగంగా మద్యం,నగదు తదితరాలను అక్రమంగా తరలించకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని…

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం