

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి)ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్ని శాఖలను సమన్వయ పరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక అధ్వాన్నంగా తయారయ్యాయని,కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే సత్య ప్రభ చొరవతో రోడ్లకు మహర్దశ కలిగిందని అన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు,సీసీ రోడ్లకు 15.83 కోట్లు మంజూరు చేయడం జరిగిందనీ అందులో 2.67 కోట్లు ఏలేశ్వరం మండలానికి మంజూరు చేయించిన ఎమ్మెల్యే సత్య ప్రభకు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూతి అప్పలరాజు(బూరయ్య),మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు,ఎంపీటీసీ పసల సూరిబాబ,క్లస్టర్ ఇన్చార్జి ధనేకుల భద్రం,బసా ప్రసాద్,ఎస్.జి.వి సుబ్బరాజు, చిక్కాల లక్ష్మణరావు,కొప్పుల బాబ్జీ,పలివెల వెంకటేశ్వరరావు,నూకతాటి ఈశ్వరరావు,పలివెల శ్రీను,జిగటాపు సూరిబాబు,బుద్దా ఈశ్వరరావు,కర్రి సుబ్బారావు, పెంటకోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.