Oplus_131072





మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సమాజ హితం కోసం ఆయన చూపిన మార్గం సదా అనుసరణీయమని వారి జీవిత సందేశాలు సమాజానికి మార్గదర్శకంగా ఉంటాయని ఆయన బోధనలు ఆదివాసీ, గిరిజన సమాజ అభ్యున్నతికి తోడ్పడటమేగాక, సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చాయని పేర్కొన్నారు ,సౌభ్రాతృత్వానికి ప్రతీకగా సేవాలాల్ మహారాజ్ నిలిచారని సమాజంలో ఉన్న అసమానతలను మరియు సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు తన చివరి శ్వాస వరకు కృషి చేశారన్నారు.
సేవాలాల్ మహారాజ్ బోధనలను సమాజంలోకి తీసుకెళ్లడంతో పాటు మనవంతుగా వాటిని పాటించడానికి కృషి చేద్దాం అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
అదేవిధంగా బంజారా సోదరుల కోరిక మేరకు జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఉత్సవ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,బంజారా నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *