

మనన్యూస్,సర్వేపల్లి:నియోజకవర్గం,వెంకటాచలం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశమై మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని అన్నారు.
ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రకటనలకే పరిమితం అవుతున్నారు అన్నారు.సోమిరెడ్డి మొక్కుబడిగా నిర్వహించిన గొలగమూడి పర్యటన చూసి, రైతులు ఆవేదన పడుతున్నారు అన్నారు.
సోమిరెడ్డి డ్రామాలు ఆపి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత సంవత్సరం పుట్టి (850 కేజీలు) ధాన్యం 25వేల రూపాయలకు అమ్ముడుపోతే, నేడు కూటమి ప్రభుత్వంలో ధర 16 వేలకు పడిపోయింది. రైతులకు కనీసం గిట్టుబాటు ధర పుట్టి(850కేజీలు)కి 19,720/- రూపాయలు కల్పించవలసి ఉండగా, దళారులు పుట్టి (850 కేజీలు)16 వేలకు దోచుకుంటున్నారు దళారులు పుట్టి (850కేజీలు) 16 వేలకు దోచుకుంటుంటే, అధికారులు, ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తూ, మిన్నకుండిపోవడం తప్ప, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు అన్నారు.రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇప్పించేందుకు అధికారంలో లేకున్నా, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు. రైతులకు ధాన్యం అమ్మకాలలో గిట్టుబాటు ధర లభ్యం కాకపోతే, మా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే, అధికారులతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తాం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారులను ఎవ్వరినీ విడిచిపెట్టం అన్నారు.
పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే నా దృష్టికి తీసుకు వస్తే, న్యాయస్థానాలను ఆశ్రయించి, ప్రైవేట్ కేసులు వేస్తాం అన్నారు.
అధికారులు అన్యాయంగా, అక్రమంగా ఎవరి పట్ల ప్రవర్తించినా, సంఘటితంగా అందరూ వెళ్లి అధికారులను నిలదీసి, అన్యాయాలను ఎదిరిద్దాం అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక నాయకులు, కార్యకర్తలు సూచనల మేరకు, బాధ్యత కలిగిన వారిని గుర్తించి, పార్టీ కమిటీలలో స్థానం కల్పిస్తాం అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ, కూటమి ప్రభుత్వంలో అవినీతి విధానాలను అసహ్యించుకుంటున్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, పోరాటాలకైన సిద్ధంగా ఉంటాం అని తెలిపారు.
