

బీసీ రిజర్వేషన్లు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన
కాంగ్రెస్ నాయకులు
బయ్యారం క్రాస్ రోడ్ లో ఘనంగా సంబరాలు
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కోట కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బయ్యారం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు పోడేం వీరయ్య, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కార్యకర్తలతో కలిసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశ చరిత్రలోనే ఎక్కడ లేనివిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు పెంపుదల చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, బీసీలకు ఆత్మగౌరవ ప్రతీకను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీలు ఎల్లప్పుడు అండగా ఉంటారని అన్నారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ బీసీలను పావులుగా వాడుకున్నదే తప్ప, బీసీల సంక్షేమానికి అభివృద్ధికి ఏమాత్రం బాటలు వేయలేదని విమర్శించారు. వచ్చే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక శాతం ప్రజలను చేకూరుతుందని , తద్వారా బీసీ సాధికార సాధిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాసం పథకాలతో దేశం మొత్తాన్ని తెలంగాణ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగించారని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటివని, మరో పాతికెళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
