

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈద్గా రోడ్డు నిర్మాణంకై ఎమ్మెల్యే డాక్టర్ వాకటి శ్రీహరికి శుక్రవారం కర్ని గ్రామ మైనార్టీ సోదరులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రంజాన్ మరియు బక్రీద్ పండుగలను పురస్కరించుకొని నమాజ్ నిమిత్తం కొరకై ఈద్గా దగ్గరకు వెళ్ళవలసి వస్తుందని అన్నాను.వెళ్ళుటకు సరైన దారి లేక వృద్ధులు పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,సాధ్యమైనంత త్వరగా మీ యొక్క రోడ్డు సమస్యని పరిష్కరిస్తానని ముస్లిం సోదరులకు హామీ ఇచ్చారు. రోడ్డు నిర్మాణం కై సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసీ త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.అనంతరం మైనార్టీ సోదరులు శాలువాతో సత్కరించి హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో,మక్బూల్,హుస్సేన్ సాబ్,మహబూబ్,చాంద్ పాషా,హుసేని,హాజీ బాబు,రిహాన్,అబ్దుల్ రెహమాన్,బురాన్, నజీం, బాక్తర్,ఖాతాల్ తదితరులు పాల్గోన్నారు.
