మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలం లోని గోర్గల్ లో హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు నిర్వహించారు. బీడీలమ్మ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి 20 నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు సాయంత్రం వరకు రసవత్తరంగా జరిగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, జహీరాబాద్ ,నారాయణఖేడ్,బాన్స్ వాడ,మద్నూర్ తదితర ప్రాంతాల నుంచి మరలయోధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.కుస్తీ పోటీలో గెలుపొందిన మరలయోధులకు మాజీ సీడీసీ చైర్మన్ సీనియర్ నాయకులు దుర్గ రెడ్డి,నాయకులు మహేందర్ రెడ్డిలు కలిసి నగదును అందజేశారు.చివరికి కుస్తీ 2000 వరకు కొనసాగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు అజ్జం దుర్గయ్య, రామ గౌడ్,గోలి లక్ష్మణ్, సాయిలు,కమ్మరి కథ అంజయ్య ,కుమ్మరి రాములు, సుభాష్ ,గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *