

ఘనంగా భగవాన్ శ్రీరామకృష్ణల జయంతి వేడుకలు
మనన్యూస్,తిరుపతి:భగవాన్ శ్రీ రామకృష్ణుల వారి 190వ జయంతి ఉత్సవాలను స్థానిక రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద స్వామి ఆధ్వర్యంలో తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఉదయం ఐదు గంటలకు మంగళహారతి సుప్రభాతం వేద పారాయణం ధ్యానంతో ప్రారంభమై రాత్రి 7 గంటలకు సంగీత కార్యక్రమం తో ముగిసింది.ఈ సందర్బంగా కార్యదర్శి సుకృతానంద స్వామిజీ ప్రసంగించిన శ్రీ రామకృష్ణుల జీవితం సందేశం సభలో భక్తులందరినీ ఆకట్టుకుంది.స్వామి ప్రసంగిస్తూ రామకృష్ణల జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమని,ఆయన ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి సందర్శించేవారని,ఎప్పుడూ ఆనందంగా ఉండేవారని,ఒకటి పక్కన ఉన్న సున్నాకే,విలువగానీ ఒకటి లేకుంటే సున్నాకు విలువ లేదని,ఆ ఒక్కటే భగవత్తత్వమని,కావున ప్రతి ఒక్కరూ భగవత్వత్వాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు.సందేశానంతరం భక్తులందరికీ ప్రసాదాన్ని అందించడం జరిగింది.నారాయణ సేవలో భాగంగా 50 మందికి టీ షర్ట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వాలంటీర్లు, భక్తులు,కమిటీ సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు.