

న్యూస్,తిరుపతి:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నెలవారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగూరు మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో వృద్ధులు వితంతువులకు 4000 రూపాయల చొప్పున పెన్షన్ ను ఆయన పంపిణీ చేశారు. నగరంలోని బండ్ల వీధి, కెనడీ నగర్ తదితర ప్రాంతాలలో పులిగోరు మురళీ కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వితతులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల ఒకటో తేదీన వృద్ధులు వితంతువులకు నెలవారి పెన్షన్లు అందజేయడంతో వారి కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిది అన్నారు. తిరుపతి నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో అన్ని రంగాల్లో తిరుపతి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పార్టీ నాయకులు గెంజి సుధాకర్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.