

మనన్యూస్,గొల్లప్రోలు:ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర మాత్రమేనని,అధికార పార్టీలు వెనక్కు తగ్గకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుం దని రాక్స్(కుట్రపూరిత ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన),మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్.రత్నాకర్ పేర్కొన్నారు.దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామ ని స్పష్టం చేశారు.అధికార పార్టీలు వెనక్కి తగ్గక పోతే తగు మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరి స్తున్న వైఖరి సక్రమంగా లేదని విమర్శించారు.కాకినాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీ మాలల భవిష్యత్తు కోసం పునరాలోచించాలన్నారు.అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణపై కుట్ర చేస్తున్నాయన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకపో తే తీవ్రంగా నష్టపోతారని రత్నాకర్హె చ్చరించారు.దళితులందరు వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడేందు కు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు.