మనన్యూస్,పినపాక:పినపాక మండలపరిధిలోని గోపాలరావుపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ అందజేశారు.పాఠశాలలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ దీవెన తన స్వంత ఖర్చులతో 20 మంది విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రమణ గారిచేత విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ అందజేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రమణ విద్యార్థులకు బాటిల్స్ కొనుగోలు చేసిన ఉపాధ్యాయురాలు దీవెనను అభినందించారు.ఈ కార్యక్రమంలో గోపాలరావుపేట,పినపాక,సీతంపేట ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు వినయ్,దేవేందర్, నరసింహారావు,సీఆర్పీ గిరి పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *