

మనన్యూస్,తవణంపల్లె:వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం కు సంబంధించి వివిధ విభాగాలకు అధ్యక్షులు ను ఎన్నుకోవడం జరిగింది.ఇందులో వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగ అధ్యక్షుడిగా తవణంపల్లి మండలం క్రాస్ రోడ్ పైపల్లెకు సంబంధించిన ఎం తేజస్ రెడ్డిని అధిష్టానం నియమించడం జరిగింది.తేజస్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అలాగే పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడిగా నాపై నమ్మకం ఉంచి నన్ను ఈ పదవికి ఎన్నుకున్నందుకు పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ కి మరియు రాయలసీమ జిల్లాల పార్టీ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాను అని తెలియజేస్తూ పార్టీకి పార్టీ ప్రతిష్టకి భంగం కలగకుండా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది.