

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మాజీ మంత్రి వైసిపి నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు వైయస్సార్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఏలేశ్వరం నగరంలో అడుగుపెట్టిన సందర్భంగా వైయస్సార్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు.ముద్రగడ గిరిబాబు నగర పంచాయతీలోని వైయస్సార్ పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. ఆయన వెంట ముద్రగడ పద్మనాభం కూడా ఉన్నారు.ముందుగా స్థానిక దేవాలయంలో పూజానంతరం అంబేద్కర్,స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులుశీడగం వెంకటేశ్వరరావుని వారినివాసంలో మర్యాదపూర్వక కలిసారు.అనంతరం నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్లు బదిరెడ్డి గోవింద్,సామంతుల సూర్య కుమార్, సుంకర రాంబాబు,పలు సంఘాల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి నగర పంచాయతీ పరిధిలో మొట్టమొదటగా ఈరోజు పార్టీ నాయకులను కార్యకర్తలను కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.నగర పంచాయతీ పరిధిలో అడుగడుగున తమకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఏలేశ్వరం నగర పంచాయతీ గుండె వంటిదని,పార్టీ అభివృద్ధి నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చూచించారు.పార్టీ కార్యకర్తలకు కష్టసుఖాల్లో మీ ఆప్తుడుగా,అండగా నేనుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.నగర పంచాయతీలో పలువురు ప్రముఖుల వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో
జువ్విన వీరాజు,వాగు బలరాం,జల్లిగంపల ప్రభాకర్,గౌతు స్వామి,బీశెట్టి అప్పలరాజు,గుడాల రాంబాబు,ఇజ్జనగిరిప్రసాద్,బంక్ శ్రీను,నియెజకవర్గం పరిధిలో పలువురు సర్పంచ్ లు,ఎంపీటీసీ సభ్యులు,పలువురు వైసీపీ పార్టీ నాయకులు,కార్యకర్తలుహాజరయ్యారు.