మనన్యూస్,గద్వాల జిల్లా: టీబీ డ్యాం సాగునీటి విడుదలతో ఆర్డీఎస్ కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే విజయుడు సకాలంలో సాగునీటిని పంపిణీ చేయించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సాగునీటి విడుదల కోసం కృషి చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గం రైతులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జనవరి 17 అలంపూర్ నియోజకవర్గ రైతులు అధైర్య పడొద్దని అండగా ఉంటామని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.తుంగభద్ర డ్యామ్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు,తెలంగాణ రాష్ట్రం కు రావాల్సిన సాగునీటినీ రెండు రోజుల క్రితం విడుదల చేయడంతో నేడు ఐజ మండల పరిధిలోని నౌరోజి క్యాంపు 18వ కాలువ కు సాగునీరు చేరుకున్నది.దీంతో ఎమ్మెల్యే విజయుడు ,ఆర్డీఎస్ డీఈఈ సచ్చింద్రనాథ్ సేథ్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గం లోని రైతులు ఆర్డీఎస్ మరియు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న పంటలు (రెండో పంట) సాగునీరు లేక ఎండిపోతుండడంతో నియోజకవర్గ రైతులు సమస్యను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొని వచ్చారు.దీంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మరియు టీబీ డ్యాం అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయంతో అల్లంపూర్ నియోజకవర్గం రైతుల సాగునీటి సమస్యను వారికి వివరించి ఏపీకి రావాల్సిన 2.5 టీఎంసీలతో పాటు తెలంగాణకు ప్రస్తుతం 1 టీఎంసీ సాగునీటిని విడుదల చేయించడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.టీబీ డ్యాం నుండి సాగునీరు విడుదల కావడంతో శుక్రవారం నాటికి మండలంలోని 18వ డిస్ట్రిబ్యూటర్ కాలువ నౌరోజి క్యాంపు వరకు సాగునీరు చేరుకున్నది. రైతులు ఎవరు అధైర్య పడొద్దని. అలంపూర్ నియోజకవర్గం రైతాంగం కోసం నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. అనంతరం ఆర్డీఎస్ అధికారులతో కలిసి సాగునీటి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సకాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడి సాగునీటిని విడుదల చేయించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కృషికి అల్లంపూర్ నియోజకవర్గం ప్రజలు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ ఏ.ఈ రామదాసు గోవర్ధన్ రెడ్డి హేమంత్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి,మాజీ టెంపుల్ చైర్మన్బా లకృష్ణారెడ్డి,తిమ్మారెడ్డి,రవిరెడ్డి,మహేశ్వర్ రెడ్డి,ముండ్ల దీన్నే తిమ్మారెడ్డి,భార్గవ్ యాదవ్, భాస్కర్ రెడ్డి,సర్వేష్ రెడ్డి,మని యాదవ్ దొండే భార్గవ్యా దవ్,వెంకటేష్,పరుశరామ్,బషీర్,సాయి చరణ్ రెడ్డి,గజేందర్ రెడ్డి,సతీష్ రెడ్డి,లడ్డు యాదవ్,మబీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *