దాతల సహకారం అభినందనీయమన్న పాస్టర్లు.. పుష్పరాజ్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు…
రైల్వే కోడూరు
రైల్వేకోడూరులో నూతనంగా నిర్మిస్తున్న సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి నిర్మాణ పనులకు టి. పుష్పరాజ్, శ్రీమతి మేరీ గ్లోరీ కుటుంబం రూ.10 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. చర్చి నిర్మాణానికి ఉదారంగా ఆర్థిక సహాయం అందించిన పుష్పరాజ్, మేరీ గ్లోరీ కుటుంబ సభ్యులను ఎస్ ఏ ఎల్ సి చర్చి పాస్టర్లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రెవరెండ్ సతీష్ విజయ్ కుమార్, రెవరెండ్ ఇమ్మానుయేల్ బాబు, రెవరెండ్ సుందర్ రావు పాస్టర్లు, డెలిగేట్ ప్రదీప్ రాజ్ కుమార్ తదితరులు విరాళం అందించిన కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన చర్చి నిర్మాణానికి ఇలాంటి దాతల సహకారం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
