మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పలు వార్డులకు మరియు చైర్మన్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగినది.
తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి రాబోయేవి మంచి రోజులని ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీ కోరుకుంటున్నారని తెలిపారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం తరువాత కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు వేయడం సంతోషకరమని,శ్రీకాళహస్తి పట్టణం నందు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఆశీర్వదించి వారి అమూల్యమైన ఓటు ను వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రేమ సుందరం, ఓ బి సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాయాదవ్,శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ,శ్రీకాళహస్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ కుమార్,నాగరాజు, మహేష్, అరుణ్, చరణ్, జోసెఫ్, సారధి, చిరంజీవి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు తదితరులు పాల్గొన్నారు.
