తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో 19వ డివిజన్ నుంచి కూటమి తెదేపా అభ్యర్థిగా ఘన విజయం సాధించిన కార్పొరేటర్ ఆనంద్ యాదవ్ తన సోదరులు, ముఖ్య నాయకులతో కలిసి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని దుస్సలావతో సత్కరించిన ఆయన, ఛైర్మన్ ఆశీర్వాదం తీసుకున్నారు.
తన గెలుపునకు సహకరించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ఓటు వేసి ఆశీర్వదించిన 19వ డివిజన్ ప్రజలకు ఆనంద్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

