తిరుపతి, అక్టోబర్ 30: తిరుపతి జిల్లా పరిధిలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. ఎం. వరప్రసాద్ సమక్షంలో పూర్తి చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వి.సి. హాల్ నందు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జిల్లాలోని తిరుపతి నగర పాలక సంస్థ, పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిర్వహించుటకు పోలింగ్ స్టేషన్ క్రమంలో పోలింగ్ సిబ్బంది
ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించే ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

డిఆర్ఓ జి. నరసింహులు,ఎన్‌ఐసీ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *