22 గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చు.

కమిషనర్ ఎం. జయకృష్ణ.

నగరంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మునిసిపల్ సాదారణ ఎన్నికల్లో భాగంగా ఈనెల 1న తిరుపతి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నున్నాయని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఎక్కడ???*
ఓటు గుర్తింపు కార్డ్ (EPIC) నంబర్ ద్వారా మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఏ వార్డ్ లో ఉన్నదో తెలుసుకునే విధానం

  1. దిగువ లింక్ క్లిక్ చేయవలెను.
  2. Search Your Name in Electoral Roll క్లిక్ చేయవలెను
  3. Search by EPIC ID క్లిక్ చేయవలెను.
  4. Urban Local Bodies క్లిక్ చేయవలెను.
  5. అక్కడ District, ULB (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను
  6. EPIC No. అనే చోట మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఇవ్వవలెను
  7. search బటన్ క్లిక్ చేయవలెను. Link 🔗
    👇🏻

[https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome]

బి. ఎల్. ఓ. ల ద్వారా మీ ఓటర్ స్లిప్పులు అందజేశామని తెలిపారు. లేని యెడల ఫోటోగ్రాప్ కలిగిన మీ యొక్క 22 రకాల గుర్తింపు కార్డులను చూపి ఓటు వేయవచ్చునని తెలిపారు. అందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పాస్ పోర్టు, ఎంప్లాయ్ ఐడెంటి కార్డు, పెన్షన్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్, ఫోటోగ్రాఫ్ విత్ పాస్ బుక్, ఏటీఎం కార్డు, రేషన్ కార్డు, స్మార్ట్ కార్డ్స్, ఎంజిఎన్ఆర్ జిఎస్ జాబ్ కార్డు, ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికెట్, ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటి కార్డ్స్, ఆర్మీ లైసెన్స్, ఫిజికల్ హ్యాండీక్యాప్ సర్టిఫికెట్, బార్ కౌన్సిల్ మెంబర్షిప్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, సెక్రటేరియట్ గుర్తింపు కార్డు, లోక్ సభ, రాజ్యసభ గుర్తింపు కార్డులను చూపి ఓటు హక్కు వినియోగించు కోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సహాయం కొరకు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *