కలిగిరి, అక్టోబర్ 30 (మన ధ్యాస ప్రతినిధి నాగరాజు)

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని *అనంతపురం గ్రామంలో* టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.కలిగిరి మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మెట్టుకూరి శిరీషా రెడ్డి,అనంతపురం ఎంపీటీసీ అభ్యర్థి బిజ్జం ఖాజా కుమారి లు సంయుక్తంగా విస్తృతస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మహిళా అభ్యర్థులు కావడంతో మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.2000 ఉన్న పింఛన్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే *రూ.4000 కు పెంచిందని*, వికలాంగులకు *రూ.6000*, కిడ్నీ, లివర్ తదితర తీవ్ర అనారోగ్య బాధితులకు *రూ.10,000* పింఛన్ అందిస్తూ ప్రతి నెల *1వ తేదీ ఉదయాన్నే* వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ అందిస్తూ అవ్వా తాతలకు అండగా నిలుస్తోందని తెలిపారు.అలాగే ఎమ్మెల్యే *కాకర్ల సురేష్* నాయకత్వంలో కలిగిరి మండలాన్ని, అనంతపురం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, గ్రామంలోని తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అభ్యర్థులు హామీ ఇచ్చారు.మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అనుభవం ఉన్న నాయకులను, మహిళా అభ్యర్థులను గెలిపించుకోవాలని కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు పిలుపునిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *