కూటమి ప్రభుత్వంతోనే అనంతపురం నగర అభివృద్ధి సాధ్యం

జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి సౌభాగ్య ప్రచారంలో పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు

అనంతపురం: నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి సౌభాగ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం నగరంలోని 8వ డివిజన్‌లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని ఓటర్లను కలిశారు.ప్రచారానికి వచ్చిన నాయకులకు డివిజన్‌ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి, గజమాలలతో ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం నాయకులు డివిజన్‌లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

8వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న స్వాతిని, మేయర్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న బీజేపీకి చెందిన కోట్ల అజేష్‌ బాబును గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు. కూటమి అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి భారీ మెజారిటీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి సౌభాగ్య మాట్లాడుతూ, అనంతపురం నగర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతోపాటు నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి నగర అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు.కూటమి ప్రభుత్వంతోనే అనంతపురం నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలంటే కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *