కమిషనర్ ఎం.జయకృష్ణ.

తిరుపతి నగరపాలక సంస్థ సాదారణ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఎస్.వి.ఆర్ట్స్ కళాశాలలో ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని కమిషనర్ ఎం.జయకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.వి.ఆర్ట్స్ కళాశాలలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రూమ్ నెంబర్ 102,103, తెలుగు విభాగం రూమ్ నెంబర్ 125,126, స్టాఫ్ రూమ్ వద్ద పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణ కొరకు ఇచ్చిన డ్యూటీ సర్టిఫికేట్, ఎపిక్ కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు నకలు ను ఖచ్చితంగా తమ వెంట తీసుకురావాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజులు పాటు ఉంటుందని తెలిపారు.. ఓటర్ల సందేహాలు నివృత్తి చేసేందుకు అక్కడే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఉద్యోగులు అందరూ తమ ఓటు కోల్పోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ ఆ ప్రకటనలో తెలిపారు. తమ ఓటు వినియోగంపై ఎటువంటి సందేహాలు ఉన్న హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *