రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66వ డివిజన్ ఎన్డీఏ కూటమి తెదేపా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా లోకేష్ యాదవ్ , మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని, తిరుపతి నగర సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతో కీలకమని తెలిపారు.

66వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా లోకేష్ యాదవ్ ఉన్నత విద్యావంతుడని, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న యువ నాయకుడని తెలిపారు.

ఎన్డీఏ కూటమి మేయర్ జేబీ శ్రీనివాస్ గారికి,66వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అన్నా లోకేష్ యాదవ్ కి, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి అన్న అనిత యాదవ్,ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *