తూర్పు యర్రబల్లిలో వింత పరిస్థితి – ఇద్దరు అభ్యర్థుల పేరు ఒక్కటే! – హాట్ టాపిక్ గా మారిన ఎంపీటీసీ పోరు*

*కొండాపురం, అక్టోబర్ 23, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:*

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు యర్రబల్లి గ్రామంలో ఎంపీటీసీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేరు ఒకేలా ఉండటంతో గ్రామంలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
*జరిగింది ఇదే:*
తూర్పు యర్రబల్లి ఎంపీటీసీ స్థానానికి ఈ నెల *21వ తేదీన వైసీపీ తరపున ఖాజా రంతుల్లా* గారు నామినేషన్ దాఖలు చేశారు. అయితే గురువారం *22వ తేదీన టీడీపీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థి పేరు కూడా ఖాజా రంతుల్లా* కావడంతో గ్రామస్తుల్లో చర్చ మొదలైంది.ఒకే గ్రామంలో, ఒకే పదవికి, రెండు ప్రధాన పార్టీల నుంచి ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు పోటీ పడటం అరుదైన విషయం. దీంతో ఓటర్లు సైతం గందరగోళానికి గురవుతున్నారని, బ్యాలెట్ పై పేరు చూసి తికమక పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ వింత పోరుపై తూర్పు యర్రబల్లిలోనే కాకుండా కొండాపురం మండల వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *