మన న్యూస్:నెల్లూరు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్, రైల్వే సౌత్ సెంట్రల్ బోర్డు మెంబర్ స్వర్ణా వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని 32వ డివిజన్ వెంగళరావు నగర్ పార్కు సమీపంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలతో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వర్ణా వెంకయ్యకు అభినందనలు తెలియజేశారు.లోక రక్షకుడైన ఏసుప్రభువు శాంతి, కరుణ, ప్రేమ, సమాధానాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు.మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణా వెంకయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీస్తు యేసు చూపించిన మంచి మార్గంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. సుమారు వెయ్యి మందికిపైగా అన్నదానం, వస్త్ర దానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నరసింహులు గౌడ్, స్వర్ణా ప్రసాద్, కార్యా నవీన్, దార్ల రమేష్, పాశం శ్రీనివాస్, సిహెచ్ హరిబాబు యాదవ్, ఏసునాయుడు, మురళీకృష్ణరాజు, బెల్లంకొండ వెంకయ్య, అల్లాబక్షు, ముత్తంగి రామయ్య, లాలం పెంచలయ్య, మాలమహానాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు బల్లి వెంకయ్య, జాన్ పీటర్, కట్టేటి మోహన్ కృష్ణ, 32, 33వ డివిజన్స్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *