శ్రీకాళహస్తి పట్టణంలోని బి.పి. అగ్రహారానికి చెందిన 30 మంది యువకులు ఈరోజు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టేసాయి ప్రసాద్ యువకులకు జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. జనసేన పార్టీలోకి యువకులు పెద్ద సంఖ్యలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా యువత చేతుల్లోనే ఉందని, సమాజంలో మార్పు తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజాసేవ, ఆయన శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషి తమను ఎంతగానో ఆకర్షించాయని తెలిపారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరినట్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మామండూరు అజిత్ రెడ్డి, యోగేశ్వర్, సాయి, పవన్,యుగంధర్, వాసు, అరుణ్, కుమార్, యోగి, సుజిత్, సాయి, ఆకాష్,సుదర్శన్, బాలాజీ మరియు ఇతర యువకులను నాయకులు అభినందిస్తూ పార్టీలోకి ప్రేమగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి జయప్రకాష్, కుమార్, మాధవ మహేష్, ఢిల్లీ బాబు, రఘు, మోహన్, సాంబ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *