కలిగిరి, అక్టోబర్ 13, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీని జనసేన అధిష్టానం ప్రకటించింది. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు ప్రకటనలో తెలిపారు.ఈ కమిటీలో అసెంబ్లీ సమన్వయకర్తలుగా *భోగినేని కాశి రావు, గుండబత్తిన రామమూర్తి, నిమ్మలపల్లి రామ చైతన్య* లను నియమించారు. నిర్వాహక దళ్‌గా మొత్తం 32 మందిని నియమించగా, ఇందులో *కలిగిరి మండలం, పెద్దకొండూరు గ్రామానికి చెందిన గుంటగాని మహేష్ వర్మ* కు కూడా చోటు దక్కడం విశేషం. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మహేష్ వర్మకు ఈ పదవి రావడంతో, ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అనంతరo ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు అవకాశం కల్పించిన నాయకత్వానికి నా మీద నమ్మకంతో ఈ కమిటీలో చోటు కల్పించిన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకత్వానికి నెల్లూరు జిల్లా జనసేన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా కలిగిరి మండల జనసైనికులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కమిటీ సభ్యులంతా కలిసి ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *