మన న్యూస్:కాకినాడ గొల్లప్రోలు డాక్టర్ అడ్డాల సేవలు యువతకు ఆదర్శనీయం అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు ఆదిత్య డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ దంతవైద్యుల దినోత్సవం నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ మరియు పీ జీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి ఈ వి ఎల్ నాయుడు తెలియజేశారు.ఆధునిక దంతవైద్య పితామహులు పద్మభూషణ్‌ డాక్టర్. ఆర్.అహ్మద్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ దంత వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాలలో దంత వైద్యుల దినోత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ ను అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు సత్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ సేవలు యువతకు ఆదర్శమని అన్నారు. డాక్టర్ అడ్డాల గత 26 సంవత్సరాలుగా కాకినాడ మరియు పరిసర గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దంతవైద్యుడు, విద్యావేత్త మరియు తరువాత పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో మంత్రి, భారతదేశం యొక్క మొదటి దంత కళాశాల స్థాపించిన డాక్టర్. ఆర్. అహ్మద్, డెంటల్ కాలేజ్ , హాస్పిటల్‌ను స్థాపించారని అన్నారు. భారతదేశంలో ఆధునిక దంతవైద్యం యొక్క పితామహుడిగా స్మరించుకుంటూ 2016లో, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అతని గౌరవార్థం డిసెంబర్ 24ని జాతీయ దంతవైద్యుల దినోత్సవంగా ప్రకటించింది అని డా అడ్డాల తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ బృందాన్ని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణా రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు తేజేశ్వరరావు , గౌరీ ప్రియ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *