
పక్కా ప్రణాళికతో గరుడసేవకు బస్సులు నడిపిన ఆర్. ఎం.శ్రీనివాసరావు!. గత శనివారం జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగమైన గరుడసేవకు పక్కా ప్రణాళికతో బస్సులు నడిపి తిరుమలకు వెళ్ళు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించిన జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాస రావు ను ఆర్టీసీ నాయకులు స్టార్ కృష్ణ, ఆవుల ప్రభాకర్ యాదవ్, వర్మ మరియు శ్రీనాథ్ తదితరులు వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి కండువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ విజయ ప్రస్థానంలో నెల్లూరు ఈ .డి. జగదీష్, డిప్యూటీ సిటిఎం విశ్వనాథ్, డిప్యూటీ సిఎంఈ బాలాజీ,అన్ని డిపోల డిపో మేనేజర్లు, అన్ని స్థాయి ఉద్యోగులు ప్రత్యేకించి డ్రైవర్, కండక్టర్ లు పాల్గొని శ్రీవారి గరుడసేవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వారు కొనియాడారు. ఇదే స్పూర్తితో వచ్చే నెల నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్.ఎం. శ్రీనివాసరావు కోరారు.