కలిగిరి సెప్టెంబర్ 19 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
శనివారం ఉదయం సుమారు 8:20 గంటల సమయంలో వర్షం కురుస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో గుడిసెలో నివసిస్తున్న తలపల రామారావు (45), తండ్రి సుబ్బారావు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.విషయం తెలుసుకున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15,000 ఆర్థిక సాయం అందించారు.అంతేకాకుండా సంబంధిత అధికారులు, ఎంపీడీవోతో ఎమ్మెల్యే మాట్లాడి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే స్పందన పట్ల గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు స్థానిక గ్రామ టిడిపి నేతలు పాల్గొనీ ఆర్థిక సాయాన్ని అందించారు.
