0-6 సంవత్సరాల పిల్లల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరo..
కలిగిరి సెప్టెంబర్ 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
సూపర్‌వైజర్ పి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కలిగిరి మండలంలోని పెద్ద అన్నలూరు అంగన్‌వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, తల్లులకు పోషకాహారం ఎంత అవసరమో వివరించి అవగాహన కల్పించారు. చిన్న పిల్లలకు తల్లిపాల యొక్క ఆవశ్యకత గురించి వివరించారు.ఆరోగ్యవంతమైన కుటుంబం మరియు పిల్లల ఎదుగుదల గురించి, పిల్లల ఎదుట మొబైల్ వాడడం వల్ల కలిగే నష్టాల గురించి, చిన్న పిల్లలలో తల్లిదండ్రులు సరైన పోషణ పద్ధతులు పాటించాలని విజయలక్ష్మి తెలియజేశారు.MPP స్కూల్ హెడ్ మాస్టర్ మహేశ్వరరావు మొదలైన వారు పాల్గొని పోషకాహార ప్రయోజనాల గురించి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్ బి సునీత, హెల్పర్ యు మాధవి తదితరులు పాల్గొన్నారు.
