రేణిగుంట సెప్టెంబర్ 12. వినాయకుడి మండపాలను వాహనాల రాకపోకలకు, బాటసారులకు అడ్డుగా ఏర్పాటు చేయకూడదు. అడ్డంకిగా ఉన్న వాటిని వెంటనే తొలగించాలి.మండపాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా అసౌకర్యం కలిగించరాదు.ఉత్సవాల పేరుతో డిజె సౌండ్ సిస్టమ్‌లు వాడటం మరియు అశ్లీల డాన్సులు ఏర్పాటు చేయడం పూర్తిస్థాయిలో నిషేధించడమైనది.భక్తులు, నిర్వాహకులు అందరూ పోలీస్ నియమ నిబంధనలను పాటించి, వేడుకలను ప్రశాంతంగా, సక్రమంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ కోరడమైనది
