“స్థానిక ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలి… ప్రజా సేవే మన లక్ష్యం!”

రేణిగుంట సెప్టెంబర్ 12.

శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి సమన్వయం మరియు ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ పార్లమెంట్ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సమీక్షా సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.పార్లమెంట్ స్థాయి సమావేశం కోఆర్డినేటర్ పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ సాయి కొట్టే ప్రసాద్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.స్థానిక సమస్యలపై అవగాహన కలిగి, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ నాయకత్వం నిర్దేశించిన కార్యాచరణను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మండల అధ్యక్షులు, వివిధ కమిటీ విభాగాల్లోని నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన ఆశావాహులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన ఆశావాహులు పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై తమ అభిప్రాయాలను తెలియజేయగా, ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై నాయకులు సమగ్రంగా చర్చించారు.ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ జనసేన పార్టీని స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది.సదరు సమావేశం లో ఉమ్మడి జిల్లా జన సేన పార్టీ అధ్యక్షులు,పి . హరి ప్రసాద్ గారు,తిరుపతి నియోజకవర్గ ఇంచార్జీ కిరణ్ రాయల్,జన సేన పార్టీ రాష్ట్ర కార్య దర్శి కీర్తన గారు పాల్గొన్నారు

సమావేశం ముఖ్యాంశాలు:-స్థానిక సంస్థల ఎన్నికలకు నియోజకవర్గ స్థాయిలో సన్నద్ధత

మండలాల వారీగా పార్టీ కార్యాచరణపై సమీక్ష.:-క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయం

ఎన్నికల్లో పోటీ చేయదలచిన ఆశావాహుల అభిప్రాయాల స్వీకరణ

ప్రజా సమస్యలను ఎన్నికల ప్రధాన ఎజెండాగా తీసుకెళ్లే కార్యాచరణ

పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై దిశానిర్దేశం

“ప్రజలతో మమేకం… కార్యకర్తలతో సమన్వయం… స్థానిక సంస్థల్లో జనసేన విజయమే లక్ష్యం!”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *