కలిగిరి సెప్టెంబర్ 08, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు..

ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని పెద్దకొండూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బొర్రా శ్రీనివాసులు కుమారుడు బొర్రా రాహుల్‌ ఇటీవల జరిగిన ప్రమాదంలో చెవికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సహకారంతో రూ.46,000 సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థిక సహాయం మంజూరైంది.మంగళవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు లబ్ధిదారునికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం లాంటిదని అన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దీర్ఘకాలిక లేదా తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొక్క హాజరత్ రావు,బొల్లినేని నిరంజన్,ద్రోణాదుల శ్రీనివాసులు, ద్రోణాదుల వెంకటేశ్వర్లు, ఎస్సీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *