తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌వీబీసీ) నూతన చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్‌-అఫీషియో సభ్యులు, టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ .డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ కి డాక్టర్. డాలర్స్ దివాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్‌వీబీసీ ద్వారా భక్తులకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక సేవలు, భక్తి కార్యక్రమాలు అందించాలని ఆకాంక్షించారు.

టీటీడీ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సనాతన ధర్మ ప్రచారాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంలో ఎస్‌వీబీసీ కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని , నందమూరి కుటుంబ సభ్యులు,శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు , రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ , ఇతర రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు,తిరుపతి కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *