

మన న్యూస్: ఏలేశ్వరం:స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2025-2026వ సంవత్సరం జిపిడిపి, బిపిడిపి యాక్షన్ ప్లాన్ గురించి ఒకరోజు శిక్షణా తరగతులను ఇంచార్జ్ ఎంపీడీవో కెవి సూర్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా గ్రామపంచాయతీ, మండల స్థాయి అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రజల సంక్షేమానికి తీసుకోవలసిన చర్యలను, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరవేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించడంపై ఈ శిక్షణ కార్యక్రమంలో తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు,గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.