ఏపీనాపి గ్రామములో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం,..గ్రామీణ పరిపాలన బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల.

కలిగిరి జులై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి మండలం, ఏపీనాపి గ్రామపంచాయతీ లో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించి, వేద మంత్రోచ్చారణల నడుమ శంకుస్థాపన నిర్వహించి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.గ్రామస్థులు తమకు అవసరమైన పుట్టిన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపులు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, ఇతర పంచాయతీ సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగా ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయం పూర్తయిన అనంతరం గ్రామ పరిపాలన మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు,టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, టిడిపి జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి ,సొసైటీ చైర్మన్ భాసం నరసింహనాయుడు, టిడిపి సీనియర్ నాయకులు ఎఫ్ సి ఐ మాజీ మెంబర్ రైతు నరేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, సర్పంచ్ పాములూరి వరప్రసాద్,ప్రజాప్రతినిధులు, అధికారులు,పార్టీనాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *