కలిగిరి జులై 02 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ (VB-G RAM G) చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ధాత మ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలిగిరి మండల అధ్యక్షుడు పూసాల వెంగప నాయుడు పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ చట్టం కింద గ్రామీణ కుటుంబాలకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు,125 రోజుల పని కల్పించడం, ప్రతి అర్హత గల గ్రామీణ కుటుంబానికి చెందిన కూలీలకు ఏడాదిలో 125 రోజుల తో పాటు ఉపాధి హామీ కల్పిస్తారు.కనీస వేతనం: దేశవ్యాప్తంగా కనీస రోజువారీ వేతనాన్ని రూ.300 గా ఖరారు చేశారు, అని ఆయన తెలియజేసారు.అధిక వేతనాలు: జాతీయ సగటు వేతనం సుమారు రూ.327.4 వరకు పెరిగింది అని అన్నారు.వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) బిల్లు, 2025 దీనినే VB–G RAM G Act, 2025 అంటారు. ఇది ‘పని చేసే హక్కు’ హామీ ఇచ్చే లక్ష్యంతో రూపొందించిన భారతీయ సాంఘిక సంక్షేమ చట్టం. దీనిని 18-19 డిసెంబర్ 2025న భారత పార్లమెంటు ఆమోదించింది.భారత ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి దార్శనికత అయిన వికసిత్ భారత్ @2047లో భాగంగా, గ్రామీణ ఉపాధి, జీవనోపాధి భద్రత కోసం సవరించిన చట్టబద్ధమైన యంత్రాంగంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 (MGNREGA) ను ఈ బిల్లు భర్తీ చేస్తుంది.వికసిత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం, 2025 లో ఆమోదించడం జరిగిందని, దీనిని జూలై 02 గురువారం ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే ప్రత్యూష, టీడీపీ ఎస్సీ సెల్ ఉదయగిరి నియోజకవర్గం అధ్యక్షులు స్వర్ణ కొండయ్య, టిడిపి కలిగిరి మండల సీనియర్ నాయకులు ఊస మాల్యాద్రి, కలిగిరి మండలం మాజీ ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, కలిగిరి మండల టిడిపి ఆర్గనైజేషన్ సెక్రటరీ నిస్సానకర సురేష్ ,ఏపీవో సుభాషిణి, ఈసి చెన్నయ్య, టిఏ రంగా, ఫీల్డ్ అసిస్టెంట్ కళావతి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *