

మన న్యూస్:తిరుపతి డిసెంబర్ 18 ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ లో, తిరుపతి జిల్లాలోని బీసీ కులాల సమావేశంను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కమిటీ నాయకులు స్థానిక తిరుపతి బీసీ నాయకులు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ తిరుపతి జిల్లా చైర్మన్ గా బి వి కేశవులు ఉడయార్ ని, నియమించడం జరిగినది కన్వీనర్ గా రాజ మణిక్యం న్యాయవాది ని నియమించడం జరిగింది. స్థానికంగా తిరుపతి అర్బన్,రూరల్ ఉన్న బీసీ కులాలలో నుండి ఒక్కో కులం నుండి ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించడం జరిగింది.వీరి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాలలో మండల కమిటీలు ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర కమిటీ ఆదేశించడం జరిగింది.అనంతరం జరిగిన సమావేశంలో బి వి. కేశవులు ఉడయార్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నాపై ఈ బాధ్యతను ఉంచిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ., తొందరలోనే జిల్లాలోని అన్ని మండలలో కమిటీలను ఏర్పాటు చేసి, బీసీల సమస్యలపై నిరంతరం పోరాటానికి ముందుంటానని తెలియజేసారు.ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పూర్ణ చంద్రరావు యాదవ్, రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ,కో కన్వీనర్, సి.శ్రీరాములు తో బాటు, రిటైర్డ్ జడ్జ్ గురప్ప, శ్రీ జయచంద్ర, ప్రభాకర్ పాల్గొన్నారు.