మన ధ్యాస నిజాంసాగర్ :జుక్కల్,
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ, ఎల్లమ్మ పండుగను పురస్కరించుకుని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఉదయం కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమైన పోటీలు రూ.100 నుంచి రూ.500, రూ.1000, రూ.2000 నగదు బహుమతులతో ఉత్కంఠభరితంగా సాగాయి.పోటీల్లో పాల్గొన్న మల్లయోధులు తమ ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను అలరించారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు నారాయణఖేడ్, జహీరాబాద్, బీదర్, కర్ణాటక, హర్యానా తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.కుస్తీ పోటీల్లో విజేతలుగా నిలిచిన మల్లయోధులకు మాగి గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ కలిసి నగదు అందజేశారు.అంతేకాకుండా చివరి కుస్తీ పోటీని గుర్రపు నారాయణ జ్ఞాపకార్థంగా నిర్వహించగా, గుర్రపు శ్రీనివాస్ విజేతకు మూడు తులాల వెండి కడియాన్ని బహుకరించారు.కుస్తీ పోటీల్లో ఎలాంటి హవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ ఐ శివకుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *