రేణిగుంట మే 24
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం న్యూఢిల్లీ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో కేంద్రమంత్రికి వి. ఎం గ్రూప్ అధినేత గుంతాటి కేతన్ శివ ప్రీతీమ్ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల కేంద్రమంత్రికి స్థానిక కూటమి నాయకులు, ప్రముఖులు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు జరిపారు. విమానాశ్రయం నుండి ఆయన రోడ్డు మార్గం గుండా తిరుపతికి బయలుదేరి వెళ్లారు.
అనంతరం కేంద్రమంత్రి అలిపిరి నుండి కాలినడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నడకదారి ద్వారా తిరుమలకు వచ్చే సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. తిరుమలలో భక్తులకు అందుతున్న అత్యాధునిక, నాణ్యమైన సదుపాయాలే ఏపీలోని కూటమి ప్రభుత్వ నిబద్ధతకు మరియు పారదర్శకమైన పనులకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సనాతన ధర్మ వ్యాప్తికి, మన ప్రాచీన సంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

