తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి దంపతులు, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తమ సతీమణితో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అర్చకులు మరియు అధికారులు సాంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు.
అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది మరియు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed