​ఘనంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న తుడా బృందం.

*​వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు, అధికారులతో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చ.
రేణిగుంట మే 21.
తుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవింద రావు తో పాటు సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ దివాకర్ రెడ్డి గత ఏడాది కాలంగా తుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు,మౌలిక వసతుల కల్పన,మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా, తుడా ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు గత ఏడాది కాలంగా తుడా యంత్రాంగం అంతా ఒక కుటుంబంలా శ్రమించారని, పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు, పారదర్శకమైన సేవలను ప్రజలకు అందించగలిగాం,” అని చైర్మన్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలపై చైర్మన్ అధికారులకు దిశానిర్దేశం చేసి,సామాన్య ప్రజలకు ఇళ్ల స్థలాలు, లేఅవుట్ల అనుమతుల్లో మరింత పారదర్శకత,వేగం పెంచాలని ఆదేశించారు.తుడా చైర్మన్‌గా ఏడాది కాలం విజయవంతం సందర్భంగా వైస్ చైర్మన్ ఆర్. గోవింద రావు మరియు అధికారులు చైర్మన్ దివాకర్ రెడ్డి కి ఘనంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.అనంతరం కార్యాలయంలో కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *