రేణిగుంట మే 21.
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి గురువారం తుడా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.పచ్చదనాన్ని పెంపొందించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి తుడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చైర్మన్ తెలిపారు.అందులో భాగంగానే ఈ మైలురాయిని స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభించినట్లు పేర్కొని,ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తుడా ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్లానింగ్ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

