హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నం అన్న పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ హయాత్ ఖాదరీ

రేణిగుంట స్వర్ణ సాగరం మే 08

మిరియాల బాబా గౌసియా ఆశ్రమం లో 67వ వార్షిక ఉరుసు చందన మహోత్సవాన్ని పురస్కరించుకొని మిరియాల బాబా ప్రియ శిష్యుడైన రేణిగుంట ఎల్లమ్మ గుడి ధర్మకర్త కీ.శే.పూల దాము రెడ్డి వారి ఇంటి నుండి ఆశ్రమానికి చేర్చిన చందనాన్ని ఆశ్రమ పీఠాధిపతి, ఆం. ప్ర స్టేట్ మషాయక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి హజరత్ ఖ్వాజా జుబేర్ హయత్ ఖాదరీ స్వీకరించి ఫాతెహా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చందనాన్ని ఫకీర్ల భక్తి విన్యాసాలు, భక్తి గీతాలాపనల తో అశేష భక్త జనసమూహం నడుమ రేణిగుంట పురవీధుల్లో ఊరగించారు. అట్టి ఊరేగించి ఆశ్రమానికి చేరిన చందనాన్ని మత గురువులైన తిరుపతి ఖాదరీయా పీఠాధిపతి సయ్యద్ షఫీ అహ్మద్ ఖాధరీ, రేణిగుంట గౌసియా ఆశ్రమ పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ హయాత్ ఖాదరీ అధ్యక్షతన ఫాతెహా కార్యక్రమాన్ని అత్యంత భక్తి పారవశ్యం తో నిర్వహించి దర్గా కి చందనాన్ని అర్పించి అనంతరం చందన ప్రసాదాన్ని విచ్చేసిన అశేష భక్తులకు పంచి పెట్టారు. దస్తగిరి స్వామి పేరిట వండిన అన్న ప్రసాదాన్ని సుమారు 1500 పైన భక్తులకు వితరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాసులతో పాటు పక్కా రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుండి భక్తులు తమ మొక్కలు చెల్లించుటకు విచ్చేసారు. పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ హయాత్ ఖాదరీ విచ్చేసిన పట్టణ సాయి బాబా గుడి నిర్వాహకులను, భక్తులను ఉరుసు కార్యక్రమానికి ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ఫాతెహా నిర్వహించి అనంతరం గంధమును ఊరేగింపు గావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *