మే 12వ తేదీన జరగనున్న శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని, తిరుమల జపాలి తీర్థం మరియు పాపవినాశనం ఆంజనేయ స్వామి ఆలయ రిటర్నింగ్ అధికారి అర్జున్ దాస్ నేతృత్వంలో అర్చక బృందం మంగళవారం తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివ నారాయణ, వేణుగోపాల్ స్వామి చైర్మన్ కి వేదాశీర్వచనం అందించారు.

అనంతరం హనుమాన్ జయంతి పర్వదినం నాడు జపాలి మరియు పాపవినాశనం క్షేత్రాల్లో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా చైర్మన్ కి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *