​తిరుపతి మే 5.

2025–26 విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మంగళవారం ఘనంగా సత్కరించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కలెక్టర్ మెమెంటోలు, శాలువాలు అందజేసి అభినందించారు.
​విద్యా సంస్కరణల ఫలితమే ఈ విజయం: కలెక్టర్
​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో గత రెండేళ్లుగా అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులను వారి అభ్యసన సామర్థ్యాల ఆధారంగా “స్ట్రీమ్, మౌంటెన్, స్కై” విభాగాలుగా వర్గీకరించి బోధించడం, ‘100 డేస్ యాక్షన్ ప్లాన్’ను పక్కాగా అమలు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని వివరించారు. రాష్ట్రస్థాయి ర్యాంకర్ల వివరాలను మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నామని తెలిపారు. విద్యాశాఖను దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.
​విజేతల వివరాలు (యాజమాన్యాల వారీగా):
​ఏపీ మోడల్ స్కూల్స్ : తనికొండ చిద్విలాస్ (ఎర్రావారిపాలెం – 586), కొంపాల ముని పూజిత (వెంకటగిరి – 585), తోట రాజా (వెంకటగిరి – 585).
​ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు : పాయసం ఇందు (వెంకటగిరి – 586), వెంపర్ల సంజనా (వెంకటగిరి – 586), పలూరు తనిష్ (ఓజిలి – 579).
​సాంఘిక సంక్షేమ గురుకులాలు : రాయపాటి ఏంజెల్ ప్రియా (నాయుడుపేట – 576), రౌతు జెస్సికా (నాయుడుపేట – 571), ఒలివా (పుత్తూరు – 570).
​గిరిజన సంక్షేమ గురుకులాలు : భుక్య శివశంకర్ నాయక్ (రేణిగుంట – 560), తుమ్మల మధు (రేణిగుంట – 558), దుర్తాటి పవిత్ర (శ్రీకాళహస్తి – 556).
​బీసీ సంక్షేమ పాఠశాలలు: అరుముల్ల మధు (దొరవారి సత్రం – 584), పంచేటి సుదీప్ (కోట – 582), యల్లంపల్లి ఇందు (చంద్రగిరి – 580).
​కేజీబీవీ పాఠశాలలు: జమ్మల సన్నీ హిత (దొరవారి సత్రం – 539), బత్తుల జెస్సీ (వెంకటగిరి – 532), గండు లోహిత (వెంకటగిరి – 528).
​ఎంపీపీ & జెడ్పీ పాఠశాలలు: ఎస్. దిశిత సాయి (వరదయ్యపాలెం – 595), ప్రసాది మొహిత్ చరణ్ సాయి (శ్రీకాళహస్తి – 591), కన్నవరం రేఖ (వరదయ్యపాలెం – 591).
​మున్సిపల్ పాఠశాలలు: గణితాల సాయి పూజిత (శ్రీకాళహస్తి – 594), ఓవియా (తిరుపతి అర్బన్ – 583), కేశంసెట్టి చందన ప్రియ (తిరుపతి అర్బన్ – 580).
​ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు: సమను గీతికా రెడ్డి (తిరుపతి – 587), కొట్టే అమని (తిరుపతి – 587), మెడ దత్తసాయి చెరిష్మా (తిరుపతి – 584).
​ప్రభుత్వ పాఠశాలలు : గుడపాకం నిహారిక (తిరుపతి – 590), నీరుగట్టి అక్షయ్ (పాకాల – 588), దొడ్డగ నివేధ (సత్యవేడు – 582).
​ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్ కుమార్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, సమగ్ర శిక్షా సెక్టోరియల్ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *