ఉదయగిరి, మే 04, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
తమిళనాడు టి వి కె అధినాయకుడు ఘన విజయం పై ఉదయగిరి మండల వైఎస్సార్ సీపీ ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు ఉన్నేమొదల గురవయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఒత్తిళ్లకు గురిచేసిన ఏమాత్రం భయపడకుండా ముందడుగు వేసినందుకు తమిళనాడు ప్రజలు ప్రత్యర్ధులు ఊహించనంత విధంగా విజయాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఎవరు ఊహించని తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన ప్రజా నాయకులు టివికె విజయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టివికె విజయ్ గెలుపు ఒక తమిళనాడులో కాక ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఆయన మరెన్నో ఉన్నతి శిఖరాల చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.