తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్‌కు సంబంధించిన పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి, వినతి పత్రం సమర్పించారు.
అసోసియేషన్ పరిధిలోని సుమారు 320 మంది సభ్యుల సంక్షేమం, సమావేశాల నిర్వహణ కోసం ఒక కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేయాలని కోరారు.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా, కొత్తగా వస్తున్న BS-6 (BS VI) వాహనాల రిపేర్ మరియు మెకానిజంపై మెకానిక్కులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ‘స్కిల్ డెవలప్మెంట్’ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:టూ వీలర్ మెకానిక్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
సాంకేతిక మార్పుల వల్ల మెకానిక్ లు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పరంగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్, సెక్రటరీ హరి ప్రసాద్, ట్రెజరర్ సాహెత్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.